Sunday, January 19, 2025
Homeసినిమా3 గెట‌ప్స్.. 30 థీమ్ డ్రెస్సుల్లో వీర‌మ‌ల్లు

3 గెట‌ప్స్.. 30 థీమ్ డ్రెస్సుల్లో వీర‌మ‌ల్లు

What a Theme: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘. ఈ భారీ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావ‌డం విశేషం. గత కొంత కాలంగా కరోనా కార‌ణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 6 నుంచి హైదరాబాద్ లో మొదలైంది.

పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో భారీ సెట్లని ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం కీలక పోరాట ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. అంతే కాకుండా భారీ సెట్ లలోనూ షూటింగ్ జరుగుతోంది. ప‌వ‌న్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో పవర్ స్టార్ కథానుగుణంగా మూడు విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్నారని తెలిసింది. అంతే కాకుండా.. సినిమాలో దాదాపుగా 30 రకాల థీమ్ డ్రెస్సుల్లో పవన్ కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నారని సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని స‌మాచారం. ప‌వ‌న్ ని 3 గెట‌ప్స్ లోనూ, అలాగే 30 థీమ్ డ్రెస్సుల్లోనూ చూస్తే అభిమానుల‌కు పండ‌గే. ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ‘వీర‌మ‌ల్లు’లో అకిరా నంద‌న్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్