Sunday, March 15, 2026
HomeసినిమాUstaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' యాక్షన్‌లోకి పవన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యాక్షన్‌లోకి పవన్

ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా హరిహర వీరమల్లు గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దాంతో, ఉస్తాద్ భగత్ సింగ్‌, ఓజీలపై పవన్ ఫోకస్ పెట్టారు.

ఉస్తాద్ షూటింగ్‌ ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు హీరో లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరించారు.మంగళవారం నుంచి పవన్ కళ్యాణ్‌ కూడా షూటింగ్‌లో చేరినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో వెంటనే పవన్ విజయవాడ వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే భైఠాయించి నిరసన తెలిపారు.

బాబుకు సంఘీభావం ప్రకటించిన పవన్ రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌ తిరిగొచ్చారు. పొలిటికల్ యాక్షన్ నుంచి ఇప్పుడు ఉస్తాద్ సెట్స్‌లో యాక్షన్ లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ శివార్లలో వేసిన దేవాలయం సెట్‌లో ప్రస్తుతం రామ్‌ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పవన్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్ తీస్తున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular