Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతి బరిలో ‘ఆ.. ముగ్గురు’

సంక్రాంతి బరిలో ‘ఆ.. ముగ్గురు’

సంక్రాంతి వస్తుంది అంటే.. తమ అభిమాన హీరో సినిమా వస్తుందా రాదా అని తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే.. రెగ్యులర్ గా వచ్చే కలెక్షన్స్ కంటే.. అంతకు మించి కలెక్షన్స్ వస్తాయి. అందుకనే హీరోలు, దర్శక నిర్మాతలు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. రానున్న సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ పుట్టినరోజు కానుకగా టీజర్ రిలీజ్ చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కూడా సంక్రాంతికి రాబోతుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేష్ వెర్సెస్ పవన్.. ఈసారి సంక్రాంతికి పోటీ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే..  సంక్రాంతి బరిలో నేను కూడా ఉన్నానంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ యూనిట్ ప్రకటించింది. అంతే కాకుండా.. జనవరి 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
దీంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇలా ముగ్గురు స్టార్ హీరోల క్రేజీ సినిమాలు పోటీపడుతుండడం వలన థియేటర్ల ప్రాబ్లమ్ వస్తుంది. పోటీలో  ముగ్గురు స్టార్ హీరోలు ఉండడంతో తమ సినిమాలను భారీ స్ధాయిలో రిలీజ్ చేయాలి అనుకుంటారు. అందరికీ ఎక్కువ థియేటర్లు కావాలి. అందుచేత ఆయా నిర్మాతల మధ్య ఎక్కువ థియేటర్ల కోసం పోటీ తప్పదు. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయా..? లేక ఈ మూడింటిలో ఒక సినిమా వాయిదా పడుతుందా..? అసలు ఏం జరగనుంది..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్