పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వంపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేశారు. షుమారు 40 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలులో అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాతలాడారు.
జగన్ ను నేరుగా దుర్కొనే దమ్ములేక వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలిసి పోటీకి సిద్ధమవుతున్నాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఓ వైపున బిజెపితో పొత్తులో ఉంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీతో దొంగచాటుగా పోతుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బాలినేని విమర్శించారు. త్వఅరలొనె అన్ని విషయాలూ బైట పెడతామని వెల్లడించారు.
మహాత్మాగాంధీ జయంతి, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం సందర్భంగా… “ నీ చుట్టూ ఉన్న వాతావరణమే నీ అభివృద్ధికి కొలమానం. పరిశుభ్రమైన పరిసరాలే మన ప్రగతికి సోపానం. మహాత్ముడు సైతం స్వచ్ఛ భారతావని నా కల అని ప్రకటించారు. నేడు వైయస్ జగన్ ఆ సూత్రాన్ని ఆచరణలో పెడుతున్నారు” అంటూ బాలినేని ట్విట్టర్ లో వెల్లడించారు.