Saturday, March 7, 2026
Homeసినిమావారసుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్?

వారసుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నట సింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సినిమాలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’ చిత్రాలు కూడా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వార్ మరింత రసవత్తరంగా మారింది. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది, విన్నర్ గా నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది.

అయితే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలకు భారీ క్రేజ్ ఉంది. వీరసింహారెడ్డి చిత్రం జనవరి 12న విడుదల అవుతుంటే.. వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల అవుతుంది. అయితే.. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ రోజునే అంటే జనవరి 12నే విజయ్ వారసుడు చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో  నిర్మాత దిల్ రాజు ఈ మూవీ పై మరింత క్రేజ్ తీసుకువచ్చేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన భారీగా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది.  చీఫ్ గెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వస్తున్నారనేది తాజా సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కు జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా  ఈ సినిమా ఈవెంట్ కు  పవర్ స్టార్ గెస్ట్ గా వస్తే.. ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular