Sunday, January 19, 2025
HomeసినిమాPawan: పవన్ ఫ్యాన్స్ కి పండగే

Pawan: పవన్ ఫ్యాన్స్ కి పండగే

ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండు బాగా నడుస్తుంది. మహేష్‌ బాబు పోకిరి సినిమా రీ రిలీజ్ చేస్తే అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా బిజినెస్ మేన్ మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కూడా భారీగా స్పందన వచ్చింది. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి చిత్రాలు కూడా రిలీజ్ చేస్తే.. వాటికి కూడా అనూహ్య స్పందన వచ్చింది. ఎన్టీఆర్ సింహాద్రి, ప్రభాస్ రెబల్.. ఇలా స్టార్ హీరోల పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. ఆ పాత చిత్రాలను నేటి యువత థియేటర్లో చూసి ఆనందిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా గుడుంబా శంకర్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్టుగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. అంతే కాకుండా.. ఈ చిత్రం ద్వారా వచ్చిన అమౌంట్ ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు సెప్టెంబర్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ డే నే భారీ అమౌంట్ వచ్చేలా.. అప్పటి వరకు ఉన్న రికార్డులను క్రాస్ చేసి రీ రికార్డు కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని తపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గుడుంబా శంకర్ సినిమాతో పాటు మరో సినిమా కూడా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అదే.. గబ్బర్ సింగ్. అవును.. గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్టుగా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తెలియచేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే.. రెస్పాన్స్ మామూలుగా ఉండదు. గుడుంబా శంకర్ సినిమా తర్వాత వెంటనే గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అయితే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే. అని చెప్పచ్చు. మరి.. ఈ రెండు చిత్రాలు రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాయో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్