Monday, May 5, 2025
HomeTrending NewsOG Glimpse: పవన్ 'ఓజీ' గ్లింప్స్ విడుదల

OG Glimpse: పవన్ ‘ఓజీ’ గ్లింప్స్ విడుదల

పవన్ కల్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓజీ’ సుజిత్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ టీజర్‌ గురించి అభిమానులు, మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. వారి ఉత్కంఠకు తెరదించుతూ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. నేడు పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఓజీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.”పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మ‌ట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు న‌రికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగకలేకపోయింది. ఇట్ వాస్ ఏ ఫ్రీకింగ్ బ్ల‌డ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే.. సాలా షైతాన్ అజాయేగా అంటూ” బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్‌ సాగింది.

ఈ చిత్రంలో ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా‌.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్‌ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్