Friday, March 20, 2026
Homeసినిమా#OG: అభిమానుల కోసం 'ఓజీ' లో మార్పులు, చేర్పులు..?

#OG: అభిమానుల కోసం ‘ఓజీ’ లో మార్పులు, చేర్పులు..?

పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీని  గ్రాండ్ గా ప్రారంభించారు. అయితే.. ఇది ముంబాయి నేపధ్యంలో జరిగే గ్యాంగ్ స్టర్ మూవీ కావడంతో అక్కడే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ ముంబాయిలో కొన్ని లోకేషన్స్ చూడడం… ఫైనల్ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరిగింది కానీ.. ఈ సినిమాలో కూడా కనిపించేది తక్కువ సేపే అని తెలిసింది. ఇంకా చెప్పాలంటే… ఇంటర్వెల్ ముందు పవర్ స్టార్ ఎంట్రీ ఉంటుందట. అంతకు ముందు వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుందట. వినోదయ సీతం రీమేక్ లో కూడా పవన్ కనిపించే నిడివి తక్కువే. ఇప్పుడు ఓజీలో కూడా అలాగే కనిపిస్తే… అభిమానులు బాగా ఫీలవుతారనే ఆలోచనలోపడ్డారట. అందుకే ఈ సినిమాలో తన క్యారెక్టర్ పెంచమని.. అవసరం అయితే ఎక్కువ డేట్స్ ఇస్తానని పవన్ చెప్పారట.

ముందు ఓజీ కోసం 30 రోజులే డేట్స్ ఇచ్చినప్పటికీ… ఇప్పుడు ఈ సినిమా కోసం 50 రోజులు డేట్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా ప్రియా అరుళ్ మోహన్ తీసుకున్నారు. ఇందులో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయట. గ్యాంగ్ స్టర్ మూవీ కావడంతో యాక్షన్ సీన్స్ వావ్ అనేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. సాహో సినిమాతో సుజిత్ భారీ యాక్షన్ సీన్స్ ను బాగా డిజైన్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సాహో మూవీతో నార్త్ అడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాడు. మరి.. ఓజీ మూవీతో ఎంత వరకు మెప్పిస్తాడో..? ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular