Friday, July 5, 2024
HomeTrending Newsకౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు: ఈసీకి బాబు లేఖ

కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు: ఈసీకి బాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పార్టీ కీలక నేతలతో  ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు సాయంత్రం అమరావతి రానున్న చంద్రబాబు  ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.  జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు.  కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని  టీడీపీ నిర్ణయించింది. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను మాత్రమే  నియమించడం పట్ల బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని,  అందుకే ఈసీ, పోలీసులు తీరుపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

కాగా,  ఎల్లుండి చంద్రబాబుతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో బిజెపి నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని టిడిపి వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను సమీక్షించనున్న కూటమి నేతలు చర్చించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్