Saturday, January 18, 2025
HomeTrending Newsబాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్

బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ-పర్యావరణం; శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఈ ఉదయం విజయవాడలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లోని తన క్యాంపు కార్యాలయంలో ముందుగా పూజలు నిర్వహించి ఆ తర్వాత అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా రెండు ఫైళ్ళపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్; గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్ మీద రెండో సంతకం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు, అధికారులు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్