Thursday, March 12, 2026
Homeసినిమాపవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలియచేసి సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల అని ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమాని జనవరి 12న విడుదల చేయనున్నట్టుగా అఫిషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది.

పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సూపర్ స్టార్ మహేష్‌ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమాను జనవరి 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఒక రోజు గ్యాప్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది. ఈ రెండు సినిమాల తర్వాత జనవరి 14న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇలా పవన్ కళ్యాణ్, మహేష్‌ బాబు, ప్రభాస్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడుతుండడంతో ఈ బాక్సాఫీస్ వార్ లో విన్నర్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular