Saturday, February 22, 2025
HomeసినిమాUstaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షెడ్యూల్ ప్రారంభం

Ustaad Bhagat Singh: పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షెడ్యూల్ ప్రారంభం

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు ఉపయోగించే ఆయుధాలన్నింటినీ రివీల్ చేస్తూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పోస్టర్‌ను షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఈరోజు షూట్‌లో జాయిన్ అయ్యారు. కొత్త షెడ్యూల్ మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్‌లో షేడ్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి అండ్ టీమ్ మాసీవ్ సెట్‌ని రూపొందించారు.మాస్ పల్స్‌ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు.

ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్