Tuesday, March 10, 2026
Homeసినిమామహేష్‌, పవన్.. ఇద్దరు మార్చేశారా?

మహేష్‌, పవన్.. ఇద్దరు మార్చేశారా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందడం.. ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తారని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే… 11 సంవత్సరాల తర్వాత ఇప్పటికి సెట్ అయ్యింది. ఈ క్రేజీ, భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జరిగిన తర్వాత మహేష్‌ కథలో మార్పులు చేర్పులు చేయమన్నారు.

మహేష్ తో యాక్షన్ మూవీ చేయాలనుకున్నప్పటికీ.. మహేష్‌ సూచనతో పూర్తిగా కథ మార్చేశారు త్రివిక్రమ్. ముందు యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయనున్నారు. డిసెంబర్ లో ఈ సినిమాను స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ..  జనవరి ఫస్ట్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మహేష్‌ బాబు.. త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ కథను మార్చేసినట్టే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా కథను పూర్తిగా మార్చేశారని టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేస్తే… ఇన్నాళ్లకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే.. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యింది. కారణం ఏంటంటే.. భవదీయుడు భగత్ సింగ్ కథ పవన్ కు నచ్చలేదట. అందుచేత ‘తెరి’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఉస్తాద్ భగత్ సింగ్ గా ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ సినిమా కథను పూర్తిగా మార్చేశారు అంటున్నారు సినీజనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular