Sunday, January 19, 2025
HomeTrending Newsపవన్ కు చికిత్స చేయించండి: చిరంజీవికి గ్రంధి సలహా

పవన్ కు చికిత్స చేయించండి: చిరంజీవికి గ్రంధి సలహా

పవన్ కళ్యాణ్ కు తగిన చికిత్స చేయించాలని ఆయన సోదరుడు, హీరో చిరంజీవికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూచించారు. నిన్న భీమవరం ఎన్నికల సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ తీవ్రంగా ప్రతిస్పందించారు. నిన్న పవన్ తీరు, భాష, వూగిపోవడం చూస్తుంటే అవి పిచ్చికి సంబంధించిన లక్షణాలు అని స్పష్టమవుతుందని, దీనికి తప్పనిసరిగా వైద్యం చేయించాల్సిందేనని అన్నారు. ఒక కుటుంబ పెద్దగా, అన్నగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మానసిక ఆరోగ్య స్థితిని పట్టించుకుని  ఆస్పత్రిలో చూపించాలని చిరంజీవిని కోరారు.  కొంతకాలం పాటు పవన్ ను సభ్య సమాజంలోకి రాకుండా కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. భీమవరంలో గ్రంధి మీడియాతో మాట్లాడారు.

కడప బాంబులు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ ఆకు రౌడీ భాష మాట్లాడుతున్నారని, మనిషిపి పిచ్చి పడితే పక్కవారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని… కానీ పిచ్చి కుక్క కరిస్తే అలాంటి వారికి దూరంగా ఉండాలని, పవన్ పరిస్థితి చూస్తుంటే ఆయనకు పిచ్చి కుక్క కరిచినట్లు అనిపిస్తుందని ఘాటుగా మండిపడ్డారు. పవన్ ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందన్నారు.

చిరంజీవి పక్కా కమర్షియల్ అని, ఆ సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే పవన్ అవసరమని అందుకే జన సేనకు రూ.5 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీని అన్న చిరంజీవి కాంగ్రెస్ కు హోల్ సెల్ గా అమ్మేశారని…  కానీ పవన్ జనసేనను టిడిపిలో కలిపేస్తే ఒకేసారి ప్యాకేజీ వస్తుందని అందుకే పార్టీని అలాగే ప్రతి ఎన్నికల్లో బాబు వద్ద సొమ్ము చేసుకుంటున్నారని, ఆయనో ప్రొఫెషనల్ వ్యాపారవేత్త అని … రాజకీయాల్లో ఇంత దగుల్బాజీని ఎప్పుడూ చూడలేదని ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్