Wednesday, February 26, 2025
HomeTrending NewsPawan Kalyan: కించపరిచే వ్యాఖ్యలు సరికాదు: పవన్

Pawan Kalyan: కించపరిచే వ్యాఖ్యలు సరికాదు: పవన్

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పవన్ విడుదల చేశారు. విమర్శ-ప్రతివిమర్శ… స్పందన-ప్రతిస్పందన హద్దులు దాటి మాట్లాడడం ఇబ్బందిగా మారిందని అభిప్రాయపడ్డారు.

పాలకులు, ప్రజలు వేరని… తెలంగాణా మంత్రులు ఏవైనా వ్యాఖ్యలు చేసినప్పుడు వారిని ఏవైనా అనాలనుకుంటే వ్యక్తిగతంగా వారిపై విమర్శలు చేయాలి గానీ మొత్తం ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. మంత్రి హరీష్ రావు ఏపీ గురించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా వైసీపీ నేతలు, మంత్రులు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం తనకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించిందన్నారు. పాలకుల వ్యాఖ్యలను ప్రజలకు వర్తింపజేయడం  సబబు కాదన్నారు. ఏపీ సీనియర్ మంత్రులకు తెలంగాణాలో ఇళ్ళు, వాకిళ్ళు, వ్యాపారాలు లేవా అంటూ పవన్ ప్రశ్నించారు. బొత్స లాంటి వాళ్ళు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళేగా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్