Sunday, January 19, 2025
HomeTrending Newsబాబు కోసమే పవన్ టూర్: కోలగట్ల

బాబు కోసమే పవన్ టూర్: కోలగట్ల

చంద్రబాబును సంతోషపెట్టడానికే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్ర స్వామి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికి పవన్ యత్నిస్తున్నారని, ఒక నిజమైన ఆలోచన, రాజకీయ పరిజ్ఞానం ఉందా అని పవన్ ను ప్రశ్నించారు. తన రాజకీయ ఉనికిని తెలియజేయడానికే ఆయన విజయనగరం పర్యటన సాగిందన్నారు. ఏదో అవినీతి జరిగిపోయిందని ఆరోపించడం తప్ప నిర్దిష్టంగా చెప్పలేకపోయారన్నారు. ‘వచ్చావు, చూశావు, వెళ్లావు…. గుంకలాం లే ఔట్ లో ఒక్క రూపాయి అనివీతి చూపించగలవా’ అని పవన్ ను నిలదీశారు. 2019లో లాగానే 2024లో కూడా పవన్ కు ఓటమి తప్పదని కోలగట్ల జోస్యం చెప్పారు. సిఎం అవుతానని కలలుగంటున్న పవన్ కు అసలు 175 స్థానాల్లో పోటీ చేసే శక్తి, సామర్ధ్యాలు ఉన్నాయా అని అడిగారు.

మంత్రులు ఏదో అవినీతి చేశారని పవన్  అన్నారని, ఒక్క విషయంపైన అయినా నిరూపించలేకపోయారని కోలగట్ల అన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి సిఎం జగన్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారని… రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు ఇస్తున్నారని, అందుకే ప్రజలంతా జగన్ వైపే ఉన్నారన్నారు. ‘గోల గోవిందరాజులుది, ముడుపులు వెంకటేశ్వర స్వామిది’ అన్నట్లుగా జగన్ ఎంత గోల చేసిన ఓట్ల సమయానికి సిఎం జగన్ కు ప్రజలు అండగా ఉంటారన్నారు.

ఉతరంధ్ర అభివృద్ధికి సిఎం జగన్ చిత్తశుద్దితో కృషి చేసున్నారని, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో జిల్లా అభివృద్ధిలో సాగుతోందని, బొత్సపై పవన్ విమర్శలు చేయడం పవన్ లేకితనానికి నిదర్శనమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్