జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నిన్న ఆ కూటమి పక్ష నేతల సమావేశంలో పాల్గొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు. బాబు గత రాత్రి తిరిగి అమరావతి చేరుకోగా పవన్ మాత్రం అక్కడే ఉన్నారు.
నేడు భార్య అన్నా లేజినోవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రధాని వారిని సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా ముచ్చటించారు.