Action: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరస్ ఫార్మా కంపెనీ కార్యకలాపాలపై వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విషవాయువులు నిర్ధారించుకునే దిశలో ఈ చర్య తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్ర మండలి వెల్లడించింది. స్టాప్ ప్రొడక్షన్స్ ఆర్డర్స్ జారీ చేస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్యకలాపాలు నిలిపివేస్తూ సెక్షన్31,33కింద నోటీసులు అందించింది.
ఇదే సెజ్ లో కార్యకలాలు నిర్వహిస్తున్న సీడ్స్ ఇంటిమేట్ అపరెల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ను మూసివేయించిన అధికారులు నేడు పోరస్ లాబ్ పై కూడా చర్యలు తీసుకున్నారు.