Saturday, January 18, 2025
HomeTrending Newsవిజిలెన్స్ నివేదిక తర్వాతే బిల్లులు: మంత్రి పెద్దిరెడ్డి

విజిలెన్స్ నివేదిక తర్వాతే బిల్లులు: మంత్రి పెద్దిరెడ్డి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విచారణ జరుగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 5 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించామని, మిగిలిన పనులకు విజిలెన్స్ నివేదిక రాగానే చెల్లిస్తామని స్పష్టం చేశారు.

జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, గ్రామాలను పచ్చదనంతో మారుస్తున్నామని పెద్దిరెడ్డి అన్నారు. గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచులకు అప్పగిస్తున్నామని, సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయన్నారు.

‘జగనన్న పచ్చతోరణం’ పై చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టామని, దీన్ని మరింత మెరుగుపరుస్తామని వెల్లడించారు. జగన్ పేరిట ఉన్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహిస్తామని, మొక్కల రక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. చిత్తూరు జిల్లలో పైలోట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటామని చెప్పారు.

మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. తానూ రైతునేనని, రైతుల కష్టాలు తెలుసని, మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్