Sunday, February 23, 2025
HomeTrending Newsబీజేపీకి, టీఆర్ఎస్ బీ పార్టీ

బీజేపీకి, టీఆర్ఎస్ బీ పార్టీ

 The Ruling Party In Telangana :

తెలంగాణలో అధికార పార్టీ పట్ల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్  హెచ్చరింహారు. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు గురువారం హైద్రాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో  ఆయన టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీకి, టీఆర్ఎస్ బీ పార్టీ అని రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్ ను రాష్ట్రం దాటించి ఢిల్లీకి పంపొద్దని ఆయన ప్రజలను కోరారు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీ సమస్యలు  పరిష్కరించుకోవాలని, దేశంలో నిరుద్యోగ సమస్యపై అందరం కలిసి పోరాడుదామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు. రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు.

బడా కంపెనీలకు  అనుకూలంగా మోడీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. రైతు సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని వద్ద సమాధానం లేదన్నారు. బాష వేరు కావొచ్చు, రైతులందరి లక్ష్యం ఒకటేనని రాకేశ్ తికాయత్ చెప్పారు. ఆందోళనలు చేసే వారిని  ప్రలోభాలకు గురి చేశారన్నారు.  అయినా కూడా రైతులంతా  ఏకతాటిపై నిలబడ్డారని, సాగు చట్టాల రద్దుపై ప్రధానమంత్రి ప్రకటనతో వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.  పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టం తేవాల్సిందేనని  రాకేష్ తికాయత్ కోరారు. కేంద్ర ప్రభుత్వం – సంయుక్త కిసాన్ మోర్చాలో విబేధాలు తెచ్చే కుట్రలు తెస్తోందని ఆయన ఆరోపించారు.

Also Read : బీజేపీ,టిఆర్ఎస్ ల పోలిటికల్ డ్రామా- రేవంత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్