Sunday, January 19, 2025
HomeTrending Newsఅప్పుడు బై బై బాబు, ఇప్పుడు ఫర్గెట్ బాబు: కాకాణి

అప్పుడు బై బై బాబు, ఇప్పుడు ఫర్గెట్ బాబు: కాకాణి

Forget Babu: గత ఎన్నికల్లో బై బై బాబు అన్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో ‘ఫర్గెట్ బాబు’ అంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి  గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్విట్ జగన్ అనేది చంద్రబాబు చెబితే సరిపోదని, గత ఎన్నికల్లో  బాబును ప్రజలే క్విట్ చేశారని విమర్శించారు. ఏదో విధంగా, అనైతికంగా అయినా సరే పొత్తులు పెట్టుకొని సిఎం పీఠం అధిరోహించాలన్నదే బాబు తపన తప్ప మరోటి కాదన్నారు.  వ్యవసాయ శాఖపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు

ఏనాడూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని, ఎప్పుడూ ఎవరితోనో కలిసి పోటీ చేయాల్సిందేనని,  పొత్తులు లేకుండా అధికారంలోకి ఎన్నడూ రాలేదని గుర్తు చేశారు.  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలంగా ఉందని, తమ పార్టీని  ఎదుర్కొనే సత్తా టిడిపికి లేదన్నారు. చంద్రబాబును ఇప్పటికే ప్రజలు బాది వదిలి పెట్టారని,  అలాంటి వ్యక్తీ బాదుడే బాదుడు అంటూ తిరగడం హాస్యాస్పదమని, అయినా అసలు బాదడానికి చంద్రబాబు రాష్ట్రంలో ఏమైనా మిగిల్చారా అని  ప్రశ్నించారు.

ఐరన్ లెగ్ చంద్రబాబుదా, జగన్ దా అనేది ప్రజలను అడిగితే చెబుతారని… బాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రానికి అరిష్టం అని, కరవు విలయ తాండవం ఆడిన మాట వాస్తవం కాదా అనికాకాణి నిలదీశారు.

శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించే ప్రక్రియ పూర్తయ్యిందని,  మీటర్ల ద్వారా విద్యుత్ ఆదా అవుతోందని, 33.75 మిలియన్ యూనిట్ల కరెంట్ ఆదా అయినట్లు తేలిందన్నారు.  ఉచిత విద్యుత్ పేరుతో ఇతరులు కూడా అక్రమంగా  వాడుకున్నట్లు  తెలిసిందన్నారు.  ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, అయితే విద్యుత్ ను ఆదా చేసేందుకు, పారదర్శకత కోసమే మీటర్లు బిగిస్తున్నామని,  ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్