Sunday, November 3, 2024
Homeసినిమాఆ నమ్మకంతోనే ‘శాంతల’ సినిమా చేశాం - కె.ఎస్.రామారావు

ఆ నమ్మకంతోనే ‘శాంతల’ సినిమా చేశాం – కె.ఎస్.రామారావు

కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పిరియాడికల్‌ మూవీ ‘శాంతల’. యిర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండో అమెరికన్‌ ఆర్ట్స్‌ పతాకం పై నూతననటుడు నిహాల్‌ కోదాటి హీరోగా, ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకున్న ఆశ్లేష ఠాకూర్‌ హీరోయిన్‌గా శేషు పెద్దిరెడ్డి దర్శకత్వంSeలో డా.యిర్రంకి సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. “సీతారామం”  చిత్రానికి బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ అందించిన విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ చేయడం విశేషం. ఈ సినిమాలోని రెండు పాటలను హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో  మీడియాకు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేషు మాట్లాడుతూ… ఈ కథను నేను కే.ఎస్‌.రామారావు గారికి చెప్పగానే, ఆయన చాలా బాగుంది శేషు, పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసి తీసుకురా.. నేను తీస్తాను అన్నారు. దాదాపు సంవత్సరంన్నర తిరిగాను. నన్ను నమ్మి ఈ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌ల విషయంలో ఆయన కేర్‌ తీసుకుని, ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ సలహాలు ఇస్తూ.. సినిమా అద్భుతంగా రావటానికి కారకులయ్యారు. ఇందుకు ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నారు.

కె.యస్‌. రామారావుగారు మాట్లాడుతూ… అమెరికాలో ఉన్న ఈ సినిమా నిర్మాతలకు కథ నచ్చడంతో మేము చేయడం కష్టం కాబట్టి మీరే ఆ బాధ్యతలు తీసుకోవాలి అన్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్‌ రేట్‌ బాగాలేనందున ముందు నేను దానికి ఇంట్రస్ట్‌ చూపలేదు కానీ.. వారికి మాత్రం ఓటీటీలో అయినా ఎంతో కొంత వర్కవుట్‌ కాకపోతుందా అని నమ్మకం. అయితే.. మీ సారధ్యం లోనే ముందుకు వెళ్తాం. మీరే ఈ ప్రాజెక్ట్‌ను నడిపించాలి అన్నారు. శేషు కూడా సంవత్సరం పైగా నా చుట్టూ తిరిగాడు. సబ్జెక్ట్‌ బాగుంది. సబ్జెక్ట్‌లో ఏదో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలు సూపర్‌ సక్సెస్‌ అవుతాయనేది అందరికీ తెలిసిందే.

ఆ నమ్మకంతోనే నేను కూడా ఈ టీమ్‌తో కలిశాను. శేషు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మా బ్యానర్‌లో క్రిమినల్‌ దగ్గర నుంచి పని చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌ దగ్గర పని చేసి వచ్చాడు. శేషు ఎంత కష్టపడి, ప్రేమించి తీశాడో.. సినిమా కూడా అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. చాలా కాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. శేషుతో పాటు డీఓపీ రమేష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ చంద్రశేఖర్‌లు చాలా కష్టపడ్డారు. మూజిక్‌, కంటెంట్‌, విజువల్‌గా అద్భుతం అనిపించే సినిమా. హీరో, హీరోయిన్‌ పెయిర్‌ కూడా చాలా అందంగా ఉంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం మొత్తం 6 లాంగ్వేజెస్‌లో చేశాం. సినిమా మీద మా నమ్మకానికి ఇదో మంచి ఉదాహరణ. ఈ సినిమాను మీడియా కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్