Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పెత్తందార్ల చేతుల్లో పేదల భూములు : పేర్ని నాని

పెత్తందార్ల చేతుల్లో పేదల భూములు : పేర్ని నాని

అసైన్డ్‌ భూములను, సొసైటీ భూములను కొందరు అక్రమార్కులు తమ హస్తగతం చేసుకుంటున్నారని, వేలాది ఎకరాల భూములు పెత్తందార్ల చేతుల్లో ఉన్నాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. ప్రభుత్వం ఓ మంఛి ఆశయంతో పేదలకు భూమి ఇస్తే లబ్ధిదారులకు తృణమో, ఫణమో అప్పచెప్పి కొందరు నిర్భీతిగా కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ భూముల విషయమై మంత్రితో మొరపెట్టుకున్నారు.

చాలాచోట్ల ప్రభుత్వ భూమి బినామీ పేర్లతో అన్యాక్రాంతమైందని, మొదటినుంచి సక్రమంగా అడంగల్‌ నిర్వహించని చోట్ల ఈ భూమి అక్రమార్కుల వశమవుతుందని నాని అన్నారు. రొయ్యల చేపల చెరువుల కోసం ప్రభుత్వ, అసైన్డ్‌ భూమితో పాటు చివరకు సిఆర్‌జెడ్‌ భూమిని సైతం వదల కుండా కొందరు ఆక్రమించారని మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. దీంతో పేదలకు పంచిన అసైన్డ్‌ భూమి పెద్దలపరం అవుతోందని, ప్రభుత్వ భూమిని సైతం మరికొందరు యధేచ్చగా కబ్జా చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

తన భర్త యలమంచలి ప్రవీణ్ విజయవాడ లోని సమాచార శాఖలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూగత ఏడాది తీవ్ర అస్వస్థత కు గురై మరణించారని ఒక మహిళ మంత్రిని కలిసి తన ఇబ్బందిని చెప్పుకొంది. తన కుమారుడు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నడని కారుణ్య నియామకాలలో అదే శాఖలో ఖాళీగా ఉన్న గుమస్తా ఉద్యోగం ఇప్పించాలని వేడుకొంది. వెంటనే స్పందించిన మంత్రి సమాచార శాఖకు చెందిన సంయుక్త సంచాలకులకు ఫోన్ చేసి కండిషనల్ ఆర్డర్ ఇవ్వవలసిందిగా కోరారు. తాను నోట్ ఫైల్ పంపిస్తానని ఆ అధికారిణికి మంత్రి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్