Wednesday, March 11, 2026
HomeTrending Newsవయసుకు తగ్గట్లు మాట్లాడు బాబూ: పేర్ని ఫైర్

వయసుకు తగ్గట్లు మాట్లాడు బాబూ: పేర్ని ఫైర్

ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తన కుమారుడు పేర్ని కిట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్ని హితవు పలికారు. కిట్టు గంజాయి అమ్ముతాడంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ… బెజవాడ క్రీనీడలో మసకబారిన మచిలీపట్నం ప్రతిష్టను పెంచడానికి…. బందరు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను కలిపి ఓ ప్రత్యేక జిల్లాగా చేసిన సత్తా ఉన్న మొనగాడు సిఎం జగన్ అని ప్రశంసించారు. చంద్రబాబు మాట్లాడేవన్నీ బొంకు మాటలేనని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని…. నిన్న బందరు సభలో బాబు, పవన్ చేసిన విమర్శలపై స్పందించారు. బాబుకు వయసు పెరిగింది కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ స్థాయికి తగ్గట్లు లేవని ఎద్దేవా చేశారు. బాబును బొంకు మాటల నాయుడుగా అభివర్ణించారు.

నాడు వైఎస్ హయంలో గానీ, గత ఐదేళ్లుగా జగన్ పాలనలో గానీ బందరు ప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న చర్యలన్నీ తన హయంలోనే వచ్చాయన్న సంగతి తెలుసుకోవాలన్నారు. కృష్ణా యూనివర్సిటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, బందరు పోర్ట్ లాంటి ఎన్నో తన హయంలో వచ్చినవేనన్నారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేయించడంతో పాటు దాన్ని ప్రారంభించి ఒక ఏడాది క్లాసులు కూడా పూర్తి చేయించిన ఘనత తనదేనన్నారు. బందరులో షాపింగ్ మాల్ కట్టుకోవాలనుకున్న రామ్ నితీష్ అనే వ్యక్తి వద్ద తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. కొల్లు రవీంద్ర కొల్లు అబద్ధంగా మారిపోయాడని, ఆయన ఏదో చెవిలో ఊడితే దాన్ని బాబు మాట్లాడడం సరికాదన్నారు.

సాయి ధరమ్ తేజ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ తనపై మాట్లాడింది బూతులు కాదా అని పేర్ని ప్రశ్నించారు. తనను తిడితే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పవన్ కాపు నేతలపై చెప్పు చూపిస్తే తానూ కూడా చూపించానని దానిలో తప్పేమిటని నిలదీశారు. 4,500 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని పోర్టు నిర్మిస్తున్నామని, ఆ నిధులు బాలశౌరి తెచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular