Friday, March 20, 2026
HomeTrending Newsఅది టెంట్ హౌస్ పార్టీ:  పేర్ని నాని

అది టెంట్ హౌస్ పార్టీ:  పేర్ని నాని

దేశంలో కిరాయికి రాజకీయపార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఒక రాజకీయ పార్టీని పెట్టి టెంట్ హౌస్ లాగా అద్దెకు ఇస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సినిమా కారవ్యాన్ లు, టెంట్ సామాన్లు అద్దెకు ఇస్తున్నట్లు ఎవరికి కావాలంటే వారికి పార్టీని అద్దెకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. దిల్ రాజు, దానయ్యతో సహా పలువురు సినీ నిర్మాతలు మచిలీపట్నంలో పేర్ని నాని తో సమావేశమయ్యారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం, సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రితో చర్చించారు.

ఈ సందర్భంగా పవన్ పై పేర్ని మరోసారి విమర్శలు గుప్పించారు. మొన్న తాను మాట్లాడిన దాంట్లో అశ్లీల పదజాలం ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. పవన్ కల్యాణ్ కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా…రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్..ఒరేయ్ అని పిలవమని అంజనాదేవి గారు నేర్పించారా అని ప్రశ్నించారు. నేను రెడ్లకు పాలేరునంటూ ఆ పార్టీ వారితో తనను తిట్టించారని, పవన్ కమ్మవాళ్లకు పాలేరా అని నిలదీశారు. నన్ను అవమానించాలని చూస్తే … ఆ అవమానాన్ని నీకు పరిచయం చేస్తానంటూ పవన్ ను హెచ్చరించారు.  వైసీపీతో ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తానంటూ పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలను నాని తీసిపారేశారు, ఇలాంటివి చాలా చూశామంటూ ఎద్దేవా చేశారు.

తనను కలవాలని సినీ నిర్మాతలు నిన్నసంప్రదించారని, ఇండస్ట్రీకి నష్టంజరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని దానిపై మాట్లాడాలని చేసిన విజ్ఞప్తి మేరకు ఈరోజు కలుసుకున్నామని చెప్పారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కు సినీ నిర్మాతలు సానుకూలంగా ఉన్నారని, ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నామని, ఇదే విషయాన్ని సీఎంకు చెప్పాలని కోరారని నాని వివరించారు. చిరంజీవి తనతో ఫోన్లో మాట్లాడారని, జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారని, ఊటీలో షూటింగ్లో ఉన్నట్లు చెప్పారని నాని వివరించారు. షూటింగ్ నుంచి వచ్చిన తరువాత వివరంగా మాట్లాడతానని తనతో చెప్పారని, ఆడియో ఫంక్షన్లో జరిగిన సంఘటనపై  బాధపడ్డారని పేర్నివెల్లడించారు. సినీ పరిశ్రమ నుంచి పలువురు పెద్దలు, నిర్మాతలు కూడా తనతో మాట్లాడి జరిగిన సంఘటనల పట్ల విచారం వెలిబుచ్చి, ఆ పిచ్చి వాగుడుతో తమకు సంబంధం లేదని చెప్పారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular