Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్తండ్రీ కొడుకుల రాజకీయ చేతబడి: నాని

తండ్రీ కొడుకుల రాజకీయ చేతబడి: నాని

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారని అందుకే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ పై  రాజకీయ చేతబడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్నూలులో టిడిపి నేత జనార్ధన్ రెడ్డి అరెస్టుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికావని, కరోనా ఉన్నంత మాత్రాన తప్పు చేసిన వారిని వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు.

మేనిఫెస్టోను కేవలం ఓట్ల కోసమే వాడుకున్న చరిత్ర చంద్రబాబుదని, కానీ మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి అమలు చేస్తున్న చరిత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని నాని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 94.5 శాతం నేరవేర్చామని….. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. తాడేపల్లిలోని  వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 30వ తేదీతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్ళు పూర్తి చేసుకుంటారని,  భవిష్యత్ సవాళ్ళకు ధీటుగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్నామని, ఉన్నత విద్యతోనే పేదరికం పోతుందనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్