Wednesday, June 26, 2024
HomeTrending Newsఆంధ్రా తాలిబన్లు టిడిపి నేతలు: పేర్ని

ఆంధ్రా తాలిబన్లు టిడిపి నేతలు: పేర్ని

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు, తెలుగుదేశం పార్టీ నేతలకు తేడా లేదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరో చెన్నైలో స్థిర నివాసం ఉండే ఓ వ్యక్తి విజయవాడ అడ్రసుతో జీఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని మత్తుమందుల వ్యాపారం చేస్తున్నట్లు వారం క్రితం వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అయితే ఎల్లో మీడియా విజయవాడలో పాపాలు జరుగుతున్నట్లు వార్తలు చిత్రీకరిస్తే, దీనిపై తెలుగు తమ్ముళ్ళు గ్రామ సింహాల్లా బజారు కెక్కడం దారుణమన్నారు. కన్న తల్లి లాంటి ఆంధ్ర ప్రదేశ్ గౌరవాన్ని దిగజార్చే విధంగా టిడిపి నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. టిడిపి నేతల వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానికి నిదర్శనమని, గత ఐదేళ్ళలో అక్రమంగా సంపాదించిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. టిడిపి నేతలను ఆంధ్రా తాలిబన్లుగా అభివర్ణించారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేందుకు, రాష్ట్ర ప్రతిష్టను మంట గలపడానికి టిడిపి విపరీతంగా ఖర్చు చేస్తోందని, వారి డబ్బులు వృథా కావడం తప్ప సిఎం జగన్ కుగానీ, వైఎస్సార్సీపీకి గానీ పోయేదేమీ ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతిరోజూ బంగారం పట్టుబడుతూ ఉంటుందని, దానికి హైదరాబాద్ కు సంబంధం అంటగట్టి మాట్లాడడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనలు 74 ఏళ్ళ గుంట నక్కకు తప్ప మరొకరికి రావని అయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
టిడిపికి చెందిన ఒక ఆకు రౌడీ ఎయిర్ పోర్టులో తుపాకీ గుళ్ళతో పట్టుబడడం వాస్తవం కాదా?
¬2014 నుంచి 2019 వరకూ గుంటూరు జిల్లాకు చెందిన ఒక పాల కంపెనీ క్యానుల్లో ఎర్ర చందనం, కాపుసారా చెన్నై, బెంగుళూరుకు తరలించింది నిజం కాదా?
హెరిటేజ్ వ్యానుల్లో ఎర్ర చందనం దుంగలను కృష్ణ పట్నం పోర్టు ద్వారా జపాన్ తరలించింది వాస్తవం కాదా?

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజల ఫలితంగా 23 సీట్లతో కుక్క చావు చచ్చింది నిజమా కాదా అని ఘాటు వ్యాఖ్యలతో పేర్నినాని నిలదీశారు.
గత ఐదేళ్ళలో నీచమైన, హేయమైన బుద్ధితో జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు 23 సీట్లతో మాడు పగిలేలా బుద్ధి చెప్పినా ఇంకా మారకపోవడం శోచనీయమన్నారు. జగన్ పై ద్వేషం ఉంటే జగన్ కే పరిమితం చేయాలి కానీ కన్నతల్లి లాంటి రాష్ట్రం మీద, రాష్ట్ర పోగొట్టేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్