Saturday, January 18, 2025
HomeTrending Newsపవన్ పొలిటికల్ ప్యారట్ : పేర్ని విమర్శ

పవన్ పొలిటికల్ ప్యారట్ : పేర్ని విమర్శ

వచ్చే ఎన్నికల్లో జనసేన మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుందో లేదో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.  పవన్ రాజకీయాల వల్ల ఎవరికీ లాభం లేదని, అయన పతిత్తు కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దసరాకు వస్తున్నా మీ సంగతి చెబుతున్నా అని పవన్ అన్నారని ఆ సంగతి ఏమైందని, ఇప్పుడు యాత్ర వాయిదా వేసుకున్నారని…. ఉదయం లోకేష్ పాదయాత్ర వాయిదా పడితే.. ఆ కాసేపటికే పవన్ యాత్ర కూడా వాయిదా పడిందని వ్యంగ్యంగా అన్నారు. పవన్ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని నాని దుయ్యబట్టారు. బాబు సూచనలతోనే  యాత్ర వాయిదా పడిందన్నారు.

పవన్ 2050 వరకూ సినిమాలకు డబ్బులు తీసుకున్నారని, పాపం ఏఎం రత్నం 2008లోనో, 2009లోనో అడ్వాన్స్ ఇచ్చారని, ఇప్పటివరకూ అది పూర్తి చేయలేదని, ఇప్పుడు డిసెంబర్ వరకూ డేట్లు ఇచ్చారని నాని అన్నారు. చెగువేరా, మదర్ థెరీసా, అంబేద్కర్, పూలే అందరూ వెళ్లిపోయారని, ఇప్పుడు నానీ పాల్కీవాలా ఆదర్శం అంటూ చెబుతున్నారని, లాయర్ల మీటింగ్ కాబట్టి ఆయన పేరు చెప్పారని నాని వ్యాఖ్యానించారు.  ఈ మీటింగ్ లో వారాంతపు రాజకీయ నాయకుడు పవన్ మరోసారి వచ్చి ఏదో మాట్లాడారన్నారు. ఎవరికీ ఏమీ గుర్తుండదనే భావనతో, భ్రమలో ఉన్నారేమో అని అనిపిస్తుందన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి ఏదో తప్పు చేసినట్లు, తాను పునీతుడినన్నట్లు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  చిరంజీవి నిఖార్సైన రాజకీయ నాయకుడని, దమ్ముగా 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టారని, తాను కూడా గెలిచారని, కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారని వివరించారు.

  • యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారు?
  • మీ ఎదుగుదలకు కారణమైన చిరంజీవికి మీరిచ్చే గౌరవం ఇదేనా?
  • 2009లో ఎవరినైతే విమర్శించారో 2014లో అదే పార్టీకి ఏ మొహం పెట్టుకొని మద్దతిచారు?
  • 18మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చిరంజీవికి దమ్ముందా, మీకా?
  • అక్కసుతో ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తూ ఉంటారు
  • ఎక్స్పైరీ డేట్ అంటూ మాట్లాడుతున్నారు, అది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ మధ్యలో పెర్ఫార్మన్స్ ఇండెక్స్ కూడా ఉంటుంది. అది మీకు లేదు.
  • మీకులాగా అందరూ అమృతం తాగి రారుగా?
  • సార్ధకత లేనప్పుడు ఏ పార్టీ పెట్టినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా  ఏం లాభం?
  • ఒకప్పుడు పొలిటికల్ ఆక్టోపస్ ఉండేవారని, ఇప్పుడు పొలిటికల్ పారట్ వచ్చింది
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 మాత్రమే వస్తున్నాయని చెబుతున్నారు.
  •  ఆ ఆక్టోపస్ చెప్పలేదా? అసలు జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో?

అంటూ పవన్ పై పేర్ని విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మవంచన చేసుకోవద్దని సలహా ఇచ్చారు.

Also Read: పవన్ పొలిటికల్ ప్యారట్ : పేర్ని విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్