Thursday, March 12, 2026
Homeసినిమాసెప్టెంబర్ 17న ‘ప్లాన్ బి’ విడుదల  

సెప్టెంబర్ 17న ‘ప్లాన్ బి’ విడుదల  

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని, నవీనారెడ్డి ముఖ్య తారాగణంగా ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం ‘ప్లాన్-బి’. ఈ చిత్రం సెప్టెంబర్ 17న  విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ “ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠతో సరికొత్త కథ కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో  సాగే కథ ఇది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి  సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని సెప్టెంబర్ 17న  విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ “మా ప్లాన్ బి కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మా చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.  సెప్టెంబర్ 17న  విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular