ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు” అంటూ చిరంజీవిని ప్రశంసించారు.
Also Read : Chiranjeevi: మెగాస్టార్ కు అరుదైన పురస్కారం