Monday, February 24, 2025
HomeTrending NewsPM Modi Tour in AP: లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు, నాసిన్ ప్రారంభం

PM Modi Tour in AP: లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు, నాసిన్ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. తొలుత లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతరం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానితో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, డా.భగవత్ కిషన్రావ్ కరాడ్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సందీప్ మల్హోత్ర, సిబిఎస్ఈ చైర్మన్ సందీప్ కుమార్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అహుడా చైర్ పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, నాసిన్ అధికారులు, తదితరులు ఈ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్