Saturday, January 18, 2025
HomeTrending Newsమోదీ ఎందుకు స్పందించ‌రు? కేటీఆర్ ట్వీట్

మోదీ ఎందుకు స్పందించ‌రు? కేటీఆర్ ట్వీట్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, పారిశ్రామిక‌వేత్త అదానీని విమ‌ర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను కేంద్రం టార్గెట్ చేయ‌డం సాధార‌ణ‌మే అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మ‌రి శ్రీలంక ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్ర‌ధాని మోదీ జోక్యం ఉంద‌ని ఆ దేశ సీనియ‌ర్ అధికారులే ఆరోపిస్తున్నారు. మ‌రి దీనిపై ప్ర‌ధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించ‌డం లేదు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఇటీవలి కాలంలో తెరాస నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్రంలో బిజెపి శ్రేణులు ప్రతి చిన్న సమస్య మీద స్పందించటం, ఆందోళనలు, నిరసనలు చేపట్టడం అధికార పార్టీని కలవర పరుస్తోంది. తాజా సర్వేల్లో బిజెపి గ్రాఫ్ రాష్ట్రంలో పెరిగిందని సిఎం కెసిఆర్ కు నివేదికలు నడినట్టు సమాచారం. దీంతో ఏ మాత్రం అవకాశం చిక్కినా బిజెపి, కేంద్ర ప్రభుత్వ విదానలపై తెరాస నేతలు విరుచుకు పడుతున్నారు.

Also Read : ట్విట్టర్లో ట్రెండ్ లో “మోదీ మస్ట్ రిజైన్”

RELATED ARTICLES

Most Popular

న్యూస్