Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వన్నూరమ్మ రైతులకు ఆదర్శం: ప్రధాని

వన్నూరమ్మ రైతులకు ఆదర్శం: ప్రధాని

ప్రకృతి వ్యవసాయంలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళా రైతు వన్నూరమ్మ దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి-2021 – 22 పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మహిళా రైతు వన్నూరమ్మ తో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దేశం మొత్తంలో కేవలం ఐదారుగురు రైతులని ప్రధానమంత్రి కార్యాలయం ఎంపిక చేస్తే అందులో వన్నూరమ్మ కూడా వున్నారు.
ఒంటరి దళిత మహిళ వన్నూరమ్మ ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి మీద నికరంగా నాలుగు రెట్లు ఆదాయం సంపాదిస్తున్నారు. అందరూ ఇలాంటి పద్ధతులనే అనుసరిస్తే రాష్ట్రం, దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుందని ప్రధాని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్