ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ప్రధాని మోదీకి ఆహ్వానం పలకలేదని అంటున్న బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశ్య పూర్వకంగానే ముఖ్యమంత్రి వెళ్ళలేదని, అయితే ఏంటని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు తాము భయపడాల్సిన పని లేదన్నారు. తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని తాము నిరసన తెలిపామన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఒరగబెట్టిందో బీజేపీ నేతలకు చెప్పే దమ్ము ఉందా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు
Also Read : సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేసిన ప్రధాని