Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పీసీవీ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం

పీసీవీ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం

చిన్నారులకు ఇచ్చే పీసీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌ ప్రారంభించారు. నెలల చిన్నారికి సీఎం జగన్‌ సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్‌ అందించారు వైద్య సిబ్బంది.

పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్