Sunday, January 19, 2025
HomeTrending Newsపోచంపల్లి నామినేష‌న్ దాఖలు

పోచంపల్లి నామినేష‌న్ దాఖలు

Pochampally Srinivas Reddy Filed Nomination :

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ఒక సెట్ నామినేషన్లను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు, ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ లు ఒక సెట్ చొప్పున పోచంపల్లి శ్రీ నివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు.

Also Read : డిసెంబరులో తెలంగాణ హెల్త్ ఫ్రోపైల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్