Saturday, January 18, 2025
Homeసినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పోకిరి

 సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పోకిరి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు అభిమానుల‌కు పండ‌గ‌రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని పోకిరి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మొదట హైదరాబాద్లో కేవలం 12 స్క్రీన్లలో మాత్రమే పోకిరి సినిమాను ప్రదర్శించాలని అనుకున్నారు కానీ… అభిమానుల నుంచి డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా రావడంతో ఇప్పుడు ప్రత్యేకంగా షో ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. మొత్తంగా మహేష్ పుట్టిన రోజు నాడు 200 షోలకు పైగా ప్రదర్శిస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ మరోసారి పోకిరి సినిమా రుజువు చేస్తోంది. ఈ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా అభిమానులలో జోష్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఎన్నోసార్లు టీవీల్లో వచ్చినా ప్రస్తుతం యూట్యూబ్ లో ఫుల్ సినిమా ఉన్నప్పటికీ కూడా మళ్లీ థియేటర్లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఓవర్సీస్లో కూడా 17 లొకేషన్లలో 24 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 11 వేల డాలర్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా పోకిరి సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో రెండవసారి ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. మహేష్ బాబు తన ద్వారా ఎంతో మంది చిన్నారులు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే ఎంతో మంది చిన్నారులకు మహేష్ బాబు ప్రత్యేకంగా సర్జరీలు కూడా చేయించాడు. అయితే ఇప్పుడు పోకిరి సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్స్ అన్నిటిని కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మహేష్ బాబు ట్రస్ట్ కోసం అంధించబోతున్నట్లు సమాచారం.

Also Read : మ‌ళ్లీ వెండితెరపైకి ‘పోకిరి’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్