సిఎం జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడి సమాచారం తెలియజేస్తే రెండు లక్షల నగదు బహుమతి అందజేస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు దోహదం చేసే కచ్చితమైన సమాచారం ఫొటోలు, మొబైల్ వీడియో రూపంగా ఎవరైనా తెలియజేస్తే వారికి ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సంబంధించిన సమాచారం వాట్సాప్ రూపంలో అయితే
- శ్రీ కంచి శ్రీనివాస రావు, డి.సి.పి.ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ – 9490619342
- శ్రీ ఆర్.శ్రీహరిబాబు, ఏ.డి.సి.పి. టాస్క్ ఫోర్సు – 9440627089 లకు పంపవచ్చని….
వ్యక్తిగతంగా కలిసి ఇవ్వదలచిన వారు కమిషనర్, టాస్క్ ఫోర్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట్, కృష్ణ లంక, విజయవాడకు నేరుగా రావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ వేశారు. ఇందులో ఆరు టీంలు పని చేస్తున్నాయి. వీళ్లంతా ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎటు నుంచి దాడి జరిగింది. ఎంత దూరంలో ఉండి ఎటాక్ చేశారనే కోణంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడకు వచ్చిన జనం తీసిన వీడియోలను కూడా పరిశీస్తున్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది