Thursday, May 8, 2025
HomeTrending Newsfake seeds: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

fake seeds: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

రైతన్నను దగా చేస్తూ నకిలీ విత్త‌నాల‌తో పాటు గడువు తీరిన పురుగు మందులను విక్రయిస్తున్న 11 మంది నిందితుల‌తో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.57 లక్షల విలువైన నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసయ‌నాలు, ప్రింటింగ్ సామగ్రి, బాటిల్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..న‌కిలీ పురుగుల మందులు విక్రయిస్తున్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారం మేరకు దాడి చేసి నిందితుల‌ను అరెస్ట్ చేశామ‌న్నారు. క‌ల్తీ మందులు విక్ర‌యించే వారి వివ‌రాల‌ను పోలీసుల‌కు తెలియ‌జేయాల‌ని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామ‌న్నారు. ఎవ‌రైనా న‌కిలీ పురుగు మందులు విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్