Monday, September 23, 2024
HomeTrending Newsపోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి - బిజెపి

పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి – బిజెపి

కరీంనగర్ జిల్లా జైలులో బండి సంజయ్ ను ఈ రోజు ములాఖాత్ లో పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, తుల ఉమ. బండి సంజయ్ కార్యాలయం ను పరిశీలించిన నేతలు, సంజయ్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న దాడిలో గాయపడిన వారిని, జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను నేతలు పరామర్శించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి నేతలు ప్రభుత్వం, పోలీసుల తీరును తప్పుపట్టారు.

సీఎం బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని, మీ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు బెదిరిపోయే వాళ్ళం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ కార్యకర్తల్లారా మీకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంజయ్ చేసిన దీక్ష సంఘ విద్రోహ చర్య నా ?  అన్న కేంద్రమంత్రి మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ధర్నా చౌక్ లో ధర్నా చేయవచ్చు మేము చేయవద్దా  అని ప్రశ్నించారు. హౌజ్ అరెస్ట్ లు ఎందుకు చేశారని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్భందం, నియంతృత్వం చూడలేదని, కెసిఆర్ నిజాం తరహా పాలన చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని.. ఇలాంటి పాలన కోసమా మనం త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుందని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందనే విశ్వాసం ఉందన్నారు. పోలీసులారా చట్టాన్ని కొందరికి చుట్టం చేయకండన్న కిషన్ రెడ్డి ప్రజా పోరాటాల మీద లక్ష్మణ రేఖ దాటకండని హితవు పలికారు. ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తే వారికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది కానీ ఇలా చెయ్యలేదని గుర్తు చేశారు. ఈ ఘటన పై అమిత్ షాకు పిర్యాదు చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

ఈటెల రాజేందర్ కామెంట్స్ ..

నిన్న జరిగిన ఘటన దురదృష్టం,నీచం, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే విధంగా ఉందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. దీనిమీద విచారణ జరిపి భద్యుల మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సమస్యలు వస్తె సీఎం పిలిచి మాట్లాడాలి. కానీ ఆ పని చెయ్యలేదని, భర్త ఒకదగ్గర, భార్య ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత జీవనంలో అల్లకల్లోలం చేసినప్పుడు.. భాధ్యత గల బీజేపీ స్పందించింది. మా అధ్యక్షడు నిబంధనలకు, కోవిడ్ రూల్స్ కి లోబడి ఆయన కార్యాలయంలో దీక్ష చేస్తుంటే.. శత్రువుల మీద దాడి చేసినట్టు చేశారని ఆరోపించారు. వాటర్ కానాంతో నీళ్ళు కొట్టి, గాస్ కట్టర్లతో గేట్లు పగులగొట్టి విధ్వంసం సృష్టించారని, మా నాయకులు, కార్యకర్తలను గొడ్లను కొట్టినట్టు కొట్టి గాయపరిచారని రాజేందర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ సీపీ భాధ్యత మరచిపోయి బానిసలాగా పనిచేశారని, ఇదంతా ఒక పథకం ప్రకారం, సీఎం ఆదేశాలతో చేశారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. వెంటనే 317 జీవో సవరణ చేసి, అభ్యంతరాలు పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ తప్పులకు మొదటి దోషి సీఎం.. 2 జొన్లను 7 గా చేశారు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నా దానిని పట్టించుకోక పొతే ఎలా అన్నారు. నీచమైన చర్యలు చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పడం తధ్యమని, అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారన్నారు. Ips లు చట్టానికి లోబడి పని చేయాల్సిన వారు సీఎం చెప్పినట్టు చేస్తున్నారని, కరీంనగర్ హోమ్ గార్డ్ డ్యూటీ, కానిస్టేబుల్ డ్యూటీ, si డ్యూటీ, సీపీ డ్యూటీ అన్నీ ఆయనే చేశారని ఎద్దేవా చేశారు.

సీపీ గుర్తు పెట్టుకో ప్రభుత్వాలు శాశ్వతం కాదని, 2023 తరువాత వచ్చేది మా ప్రభుత్వమే అని రాజేందర్ హెచ్చరించారు. సీపీ భాధ్యత మరచి పోయి బానిస లాగా పని చేశారని, మమ్ముల్ని ఇబ్బంది పెడితే పెట్టారు కానీ ఉద్యోగులను మాత్రం ఇబ్బంది పెట్టకండన్నారు. రైతాంగం, కార్మికులు, ఆర్టీసీ, నిరుద్యోగుల మీద దాడులు చేశారు ఇప్పుడు ఉద్యోగుల మీద దాడి చేస్తున్నారన్న ఈటెల… కెసిఆర్ మీరు పెట్టిన బాధలు ఎవరు మర్చిపోరన్నారు. ప్రజలకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : బండి సంజయ్ కు బెయిల్ నిరాకరణ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్