Sunday, January 19, 2025
Homeసినిమాపాపం.. పూజా బాగా ఫీలవుతుందట!

పాపం.. పూజా బాగా ఫీలవుతుందట!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో మహేష్ కు జంటగా పూజా హేగ్డేను ఫైనల్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు పది రోజులు పాటు షూటింగ్ చేశారు. ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా నుంచి పూజా తప్పుకుందని.. ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి నటిస్తుందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత గుంటూరు కారం అనుకున్నంత ఫాస్ట్ గా షూటింగ్ జరగడం లేదని.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి.

అయితే.. ఇప్పుడు కొత్తగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే.. మహేష్ ఒత్తిడి వలనే త్రివిక్రమ్ ఆమెని ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చిందట. గతంలో మహేష్‌, పూజా కలిసి మహర్షి అనే సినిమాలో నటించారు. మరి.. ఈ సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఆమె పై వ్యతిరేకత వచ్చిందో తెలియదు. ఆమెకు ఈమధ్య సక్సెస్ లేదు. ఆ కారణంగానే మహేష్ పూజాను తప్పించమన్నారేమో అని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ కష్టకాలంలో ఈ సినిమా తనకి ఎంతగానో ఉపయోగపడుతుందని.. మళ్లీ ఈ సినిమాతో కెరీర్ లో మంచి ఊపు వస్తుందని అనుకుందట.

ఇప్పుడు ఇలా ఈ మూవీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో బాగా ఫీలవుతుందట. ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు.  అందుకనే మిడ్ రేంజ్ హీరోలతో నటించాలనుకుంటుందని టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా ముందుగా పూజాను అనుకున్నారు కానీ తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ గుంటూరు కారం నుంచి తప్పుకోవాల్సివచ్చింది. విజయ్ దేవరకొండతో జనగణమన చేయడానికి ఓకే చెబితే ఆ ప్రాజెక్టే ఆగిపోయింది. పాపం.. పూజా టైమ్ అస్సలు బాలేనట్టుంది. మళ్లీ ట్రాక్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్