Sunday, January 19, 2025
HomeTrending Newsపోస్టాఫీసుల్లో 34 పౌర సేవలు

పోస్టాఫీసుల్లో 34 పౌర సేవలు

రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ నవంబరు నెలాఖరు కల్లా సర్వ సేవా కేంద్రాలు(సీఎస్‌సీ)గా మార్చేందుకు ఏపీ తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో తపాలా సేవలతో పాటు 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే కంప్యూటర్లు అందుబాటులో ఉండి, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న 1,568 పోస్టాఫీసులను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మార్చేశారు. మరో 8,504 పోస్టాఫీసులను రెండు నెలల్లో సీఎస్‌సీలుగా మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తపాలా సీఎస్‌సీల్లో అందించే సేవలు:
పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్‌ రీఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్‌టీఏ, డీటీహెచ్‌ సేవలు, విద్యుత్తు, నీటి బిల్లులు, గ్యాస్‌ కనెక్షన్లకు దరఖాస్తు, ఫాస్ట్‌ట్యాగ్‌ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్లు, ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి యోగిమాన్‌ ధన్‌ యోజన వంటి పథకాలకు దరఖాస్తులు, సాయిల్‌ హెల్త్‌కార్డ్‌, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులు..

గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం:
‘‘తపాలా శాఖకు ఉన్న పరిధిని ఉపయోగించుకుని అన్ని గ్రామాలకూ ఈ ఆన్‌లైన్‌ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డా.అభినవ్‌ వాలియా తెలిపారు. ‘‘సీఎస్‌సీలలో అందించే సేవలపై రాష్ట్రంలోని నాలుగు వేల మందికిపైగా తపాలా శాఖ సిబ్బంది తర్ఫీదు పొందారు. ఇప్పటి వరకు తపాలా సీఎస్‌సీల ద్వారా సుమారు రూ.1.30 కోట్ల విలువైన 11,710 లావాదేవీలు చేశాం’’ అని అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ సుధీర్‌బాబు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్