Saturday, January 18, 2025
Homeసినిమాకనుల విందు చేస్తున్న 'హరి హ‌ర వీర‌మ‌ల్లు' పోస్టర్

కనుల విందు చేస్తున్న ‘హరి హ‌ర వీర‌మ‌ల్లు’ పోస్టర్

Power Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు‘.  పవన్ స‌ర‌స‌న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ న‌టిస్తోంది. ఇటీవలే తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్  పవన్ కళ్యాణ్ కొత్త  పోస్టర్ ని  రిలీజ్ చేశారు. పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో పవన్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ హైలైట్ అవుతుంది.

గ్రీన్ కలర్ దుస్తులపై మెడలో శాలువా ధరించి చేతిలో ఈటె పట్టుకుని గంభీరమైన చూపుతో శ్రతువు వైపు గురిపెట్టినట్లు  కనిపిస్తుంది. ఈ లుక్ లో క్రిష్  పవన్ ని అదిరిపోయే లుక్ లో చూపించాడ‌ని చెప్పొచ్చు. మునుపెన్నడూ చూడని సరికొత్త పవన్ ని పోస్టర్ లో ఆవిష్కరించినట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ తో సినిమాపై మ‌రెన్ని అంచ‌నాలు పెంచేశారని చెప్ప‌చ్చు. పోస్టర్ ఈ రేంజ్లో ఉంటే.. ఇక‌ టీజర్ అండ్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఆస‌క్తిగా మారింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ క్రేజీ మూవీని ద‌స‌రాకి రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Also Read : ‘వీర‌మ‌ల్లు’లో అకిరా నంద‌న్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్