Friday, September 20, 2024
Homeసినిమావచ్చే ఏడాది ఆగస్టులో ‘ఆది పురుష్’

వచ్చే ఏడాది ఆగస్టులో ‘ఆది పురుష్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా నటిస్తుంది. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ ను శ్రీరాముడి గెటప్ లో చూద్దామని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ శ్రీరాముడు గెటప్ ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఆదిపురుష్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు. 2022లో ఆగష్టు 11న ఆదిపురుష్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి మూవీ ఇది. దీంతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’తో పాటు ఆదిపురుష్ షూటింగ్ లోను పాల్గొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్