Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్ ద్విపాత్రాభినయం నిజమేనా..?

ప్రభాస్ ద్విపాత్రాభినయం నిజమేనా..?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ కాంబో మూవీ గురించి వార్తలు వచ్చినప్పుడు ఇదేదో గాసిప్ అనుకున్నారు. ఆతర్వాత ఇది నిజమే అని తెలిసినప్పుడు అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు. అభిమానులే కాకుండా.. ఇండస్ట్రీలో కొంత మంది ప్రభాస్ సన్నిహితులు మారుతితో సినిమా చేయద్దు అని చెప్పారని వార్తలు వచ్చాయి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ప్రభాస్ మారుతితో సినిమా చేయడం ఆపలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

ఈ సినిమా గురించి ఓ సరికొత్త వార్త బయటకు వచ్చింది. ఏంటంటే.. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభనియం చేస్తున్నారట. ఈ సినిమాలో హీరో, విలన్ రెండూ ప్రభాసే అని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయట. మొత్తానికి మారుతి, ప్రభాస్ కోసం అద్భుతమైన, వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడట. ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మారుతి చాలా హామ్ వర్క్ చేశాడట. ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో  షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. దీనికి కారణం ప్రభాసే అని తెలిసింది. వరుసగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మారుతితో సినిమా అప్ డేట్ ఇస్తే.. ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అవుతారు. అందుచేత ఆదిపురుష్ రిలీజ్ వరకు ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ రిలీజ్ చేయద్దు అని ప్రభాస్ మేకర్స్ కి చెప్పారట. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్నట్టుగా ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తే.. అభిమానులకు పండగే.

Also Read : ప్రభాస్ కోసం రంగంలోకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్