Tuesday, March 17, 2026
Homeసినిమాప్రభాస్ .. మారుతి ప్రాజెక్టు అప్ డేట్ ఏది?

ప్రభాస్ .. మారుతి ప్రాజెక్టు అప్ డేట్ ఏది?

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించి దాదాపు ఏడాది కావొస్తోంది. దగ్గరలో కూడా ఆయన సినిమాల రిలీజులు లేవు. ప్రభాస్ చేసిన ‘ఆది పురుష్’ నుంచి టీజర్ వచ్చేంతవరకూ ఒక రేంజ్ లో అంచనాలు ఉండేవి. ఆ తరువాత ఆ ప్రాజెక్టు అప్ డేట్స్ తెలుసుకోవడానికి కూడా ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపడం లేదు. ఆ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. రిలీజ్ విషయంలోనే ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

ఇక ప్రభాస్ తన ఇమేజ్ కి తగిన మాస్ లుక్ తో చేస్తున్నాడు గనుక, ‘సలార్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, షూటింగు పరంగా చాలా సమయం తీసుకుంటోంది. షెడ్యూల్ .. షెడ్యూల్ కి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. అందుకు కారణం ఏమిటనే విషయాల్లో కూడా క్లారిటీ కనిపించదు. ఈ ప్రభావం విడుదల తేదీని వెనక్కి నెడుతూ వెళుతోంది. ‘ప్రాజెక్టు K’ విషయంలో కూడా అప్ డేట్స్ అంత జోరుగా రావడం లేదు. 2024 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామనే అశ్వనీదత్ పాత ఇంటర్వ్యూ మాత్రమే కనిపిస్తోంది.

ఇలా తన మూడు భారీ సినిమాలు విడుదల దగ్గరలో లేకపోవడంతో, చకచకా ఒక మీడియం బడ్జెట్ సినిమాను తీసి వదిలేయాలని ప్రభాస్ అనుకున్నాడు. దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.’రాజా డీలక్స్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. షూటింగు మొదలలైందని కూడా అన్నారు. కానీ దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. ప్రభాస్ అభిమానులు మాత్రం మూడు పాన్ ఇండియా సినిమాలు వచ్చేలోగా ఈ సినిమాలో ప్రభాస్ చూస్తామనే ఆశతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఎంతవరకూ వచ్చిందనేది తెలియాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular