ప్రభాస్, మారుతి కాంబినేషన్లో మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ.. టైమ్ దొరికినప్పుడల్లా డేట్స్ ఇస్తూ ఈ సినిమాని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే.. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ఖరారు చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. దాదాపుగా ఈ టైటిలే ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్స్ ఆలోచిస్తున్నారంటూ రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.
ఇంతకీ ఆ రెండు టైటిల్స్ ఏంటంటే.. ఒకటి ‘రాయల్’, రెండోది ‘రాజా సాబ్’. ప్రభాస్ కటౌట్ కి ఈ టైటిల్స్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయని మేకర్స్ ఆలోచిస్తున్నారట. డైరెక్టర్ మారుతి ఈ టైటిల్సే కాకుండా వేరే టైటిల్స్ కూడా ఆలోచిస్తున్నాడట. అయితే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ టైటిల్స్ ను రిజిష్టర్ చేయించడంతో దాదాపు ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి కన్ ఫర్మ్ అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఆగష్టు నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ప్రాజెక్ట్ కే మూవీతో పాటు ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ప్రాజెక్ట్ కే మూవీ రిలీజ్ అయిన తర్వాతే ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుచేత రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.