Saturday, January 18, 2025
Homeసినిమాశివపార్వతులుగా ప్రభాస్ - నయన్!

శివపార్వతులుగా ప్రభాస్ – నయన్!

మంచు విష్ణు ఇప్పుడు ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా షూటింగు న్యూజిలాండ్ లో జరుగుతోంది. ‘కన్నప్ప’ కథ అంతా కూడా అడవి నేపథ్యంలో గిరిజన గూడెంలో జరుగుతుంది. అయితే అందుకు అద్భుతమైన లొకేషన్స్ అవసరం ఉంటుంది. న్యూజిలాండ్ లో అలాంటి అందమైన లొకేషన్స్ ఉండటంతో, ఈ సినిమా టీమ్ అక్కడికి వెళ్లింది. అక్కడి కొండలు .. జలపాతాలు .. అడవి నేపథ్యంలో ఇతర సుందరమైన దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడని చెప్పారు. అలాగే మరో ప్రత్యేకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరూ ఈ సినిమాలో శివపార్వతులుగా కనిపించనున్నారనేది తాజా సమాచారం. ‘కన్నప్ప’ భక్తిని పరీక్షించడం … ఆయనను అనుగ్రహించడం వంటి సన్నివేశాలలో శివపార్వతులు తెరపైకి వస్తారు. పాత్రల నిడివి తక్కువే అయినా, కథా పరంగా శివపార్వతులకు ప్రాధాన్యత కనిపిస్తుంది.

శివుడిగా ప్రభాస్ .. అర్జునుడిగా ఉన్నప్పటి విష్ణుకి మధ్య ఒక భారీ ఫైట్ ఉంటుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ఒక రేంజ్ లో డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. శివపార్వతులుగా ప్రభాస్ – నయనతార కనిపించనుండటం తప్పకుండా ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో మోహన్ లాల్ .. శివ రాజ్ కుమార్ కనిపించనున్నారు. మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరవుతానని రజనీ మాట ఇచ్చినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

Also Read: దసరా డైరెక్టర్ తో ప్రభాస్‌ మూవీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్