Friday, September 20, 2024
HomeసినిమాPrabhas: ప్రభాస్, సుక్కు కలిసి సినిమా చేయనున్నారా..?

Prabhas: ప్రభాస్, సుక్కు కలిసి సినిమా చేయనున్నారా..?

కొన్ని కాంబినేషన్లు గురించి వినగానే.. ఈ కాంబినేషన్లో మూవీ సెట్ అయితే మామూలుగా ఉండదు అనిపిస్తుంటుంది. అలాంటిదే ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అలాగే పుష్ప సినిమాతో సుకుమార్ క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్స్. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తే.. ఆ రేంజే వేరుగా ఉంటుంది. ప్రభాస్.. సుకుమార్ తో ఎప్పుడో మూవీ చేయాలి అనుకున్నారు కానీ.. బిజీగా ఉండడం వలన ఈ క్రేజీ కాంబో మూవీ సెట్ కాలేదు.

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే చరణ్‌ తో మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ, చరణ్ లతో లేకపోతే.. ప్రభాస్ తో మూవీ సెట్ కావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ సైతం.. ప్ర‌భాస్ కోసం ఓ ప‌ర్‌ఫెక్ట్ స్టోరీ లైన్ రెడీ చేసిన‌ట్టు టాక్‌. ఈసారి.. సుకుమార్ ఓ పిరియాడిక‌ల్ స్టోరీ ఫిక్స్ చేశాడ‌ట‌. అది ర‌జాకారుల ఉద్య‌మ నేప‌థ్యంలో సాగే క‌థ అని సమాచారం.

ఈ క‌థ ప్ర‌భాస్‌కి కూడా వినిపించాడట. పుష్ప 1, పుష్ప 2 మ‌ధ్య వచ్చిన గ్యాప్ లో సుకుమార్ ఈ క‌థ‌ పై వ‌ర్క్ చేసిన‌ట్టు తెలిసింది. పుష్ప 2 అయ్యాక‌.. కొంత గ్యాప్ తీసుకొని, ఈ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడు. మ‌రో వైపు ప్ర‌భాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నాడు. అయితే.. వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయడం ప్రభాస్ కు అలవాటే. అందుచేత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ చేస్తూ సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నాడని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్