Friday, March 13, 2026
Homeసినిమా‘మహాసముద్రం’ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంస

‘మహాసముద్రం’ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంస

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ‘ఆర్.ఎక్స్ 100’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేశారు.

రిలీజైన రెండు రోజుల్లోనే 4.5 మిలియన్ల వ్యూస్‌తో ఇప్పటికీ నెం.1 ట్రెండింగ్‌లో ఉంది. ఈ ట్రైలర్ ఎంతో మంది సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ట్రైల‌ర్ పై స్పందించారు. “మహా సముద్రం ట్రైల‌ర్ ఎంతో ఇంటెన్స్ తో ఉంది. అలాగే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. శర్వానంద్, సిద్దార్థ్, ఈ సినిమా  టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంద‌ర్భంగా బాహుబలి స్టార్ ప్ర‌భాస్ కి మ‌హా స‌ముద్రం టీమ్ ధ‌న్య‌వాదాలు తెలిపింది.

అదితీ రావ్ హైదరీ, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్, కేజీయఫ్ రామచంద్ర కీల‌క‌పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. చేతన్ భరద్వాజ్ స్వ‌ర‌ప‌రిచిన అన్ని పాటలు శ్రోత‌ల‌ని ఆకట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular